మనిషి జీవితాన్ని నడిపించే ప్రధాన సారథి మనసు. తీరని కోర్కెలకు నెలవు ఈ మనసు. అందులో అన్నిరకాల కోరికలూ కలుగుతాయి. ఆ మనసు ఆజ్ఞాపించినట్టు కర్మలు చేస్తుంటాం. ఏ కోరిక చేయించిన కర్మ జీవున్ని పరిశుద్ధము చేస్తుంది, ఏ కోరిక చేయించిన కర్మ బురదలోకి తోస్తుందో విచక్షణముతో ఎన్నుకోవాలి. ఆ విచక్షణ ఎలా వస్తుంది మరి? అది రావాలంటే భగవత్తత్వం మీదకి మనసుని అప్పుడప్పుడూ మఱలిస్తుండాలి.
ఇప్పుడు మఱలిద్దాంరండి...
ఏమి గొప్పలున్నాయ్ ఈ మానవ జీవితంలో? ఎందుకిన్ని పోరాటాలు చేస్తున్నాం? ఇన్నిపోరాటాలు చేయిస్తూ జీవితాన్ని ముందుకు నడిపేది ఏది? ఆశ! కడ మొదల లేని ఈ వాంఛలతో నిండియున్న మనసుని నడిపించేది అదే. ఇన్ని పోరాటాలు, కష్టాలూ ఆ మనసు వాంఛ తీర్చేందుకే. అయితే ఇవన్ని వృథాయే. ఎన్ని సాధించినా వ్యర్థమే. ఎందుకంటే, ఇవేవి జీవుడుకి పరమార్థాన్ని సంపాదించిపెట్టేవి కావు.
ఈ జీవితం శాశ్వతమేమి కాదు. వత్తిలో నూనె ఉన్నంతవరకే దీపం వెలుగు. ఆ నూనె అయిపోతే చీకటే. అలా దేహములో కంటికి కనబడక జీవితాన్ని నడిపించేది ప్రాణం! ఆ ప్రాణం ఉన్నంతవరకే ఈ దేహానికి అన్నియాటలూ. నిజానికి ఈ దేహాం కూడా వ్యర్థపదార్థమే! గింజమీద ఎలాగైతే పొట్టు ఉంటుందో అలాగే ఆ ప్రాణాన్ని లోపలనిలుపుకున్న పొట్టు ఈ దేహం. మొలకొచ్చేవరకే పొట్టుయొక్క అవసరం విత్తనానికి. ఆ పైన ఆ పొట్టు వ్యర్థ పదార్థమే కదా? మఱి అటువంటి వ్యర్థపదార్థమైన ఈ దేహాం సుఖాలదారివైపుకే పాకులాడుతుంది. ఆ దేహాన్ని ప్రాణంకోసం వాడుకోవాలికానీ, ప్రాణాన్ని దేహంకోసం కాదు. దేహానికి భక్తి అంటదు. శాశ్వతము కాని ఈ దేహం కోరుకునే శారీర సుఖాలవైపుకి వెళ్ళకుండ మనసుని అదుపులో ఉంచుకోవడమే ప్రధానము.
ధనముంటే మనచుట్టూ ఎంతమందైనా చేరుతారు. మనకన్నా గొప్పవారు లేరని పొగుడుతారు. పొగడ్తలకు మురిసిపోతాము. ఆ పొగడ్తల మత్తుకోసం ఇంకా ఇంకా ఎక్కువ సిరిసంపదలు కావాలనుకుంటాం. చాకలి మడుగులో బండకేసి ఉతుకుతుండగా ముఱికి ఎలాగైతే బట్టలను వదలిపోవునో అలా వదిలెళ్ళిపోయేటివే మనం అష్టకష్టాలుపడి సంపాదించే సిరులూ, సంపదలూ. ప్రాణం ఈ దేహాన్ని వదిలినప్పుడు ఆ సంపదలేవీ మనతో రావు. అటువంటి ఐశ్వర్యాలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత?
ఈ బ్రతుకు ఎంత నీచమైనదీ? ఈ పొట్టని నింపుకునేందుకు ఎన్నెన్ని పాపములు చేయిస్తుంది? మనం చేసిన పాపాలన్నిటికీ, గాదేలోపోసిన ధాన్యంలాగా లెక్క రాయబడి ఉంది ఆ పైవానివద్ద. ఈ పాపాలనుంచీ, వేదనలనుంచీ మోక్షములేదా? ఎందుకు లేదు? ఆ వేంకటేశుని మనస్పూర్తిగా “నువ్వే శరణని” అర్థించినవారికి ఆయన కృపాకటాక్షమనేటి తాడు చేచిక్కుతుంది. ఆ తాడుపట్టుకుని మోక్షము చేరుకోవచ్చు అంటారు అన్నమయ్య.
===================================
రాగం : వరాళి
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
====================================
====================================
పల్లవి
ఏమిగల దిందు నెంతపెనగిన వృథా
కాముకపు మనసునకు కడమొదలు లేదు
చరణం 1
వత్తిలోపలినూనెవంటిది జీవనము
విత్తుమీదటిపొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక
చరణం 2
ఆకాశపాకాశ మరుదైన కూటంబు
లోకరంజనము తమలోనిసమ్మతము
చాకిమణుగులజాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదరినను నేమి
చరణం 3
గాదెబోసినకొలుచు కర్మిసంసారంబు
వేదువిడువనికూడు వెడమాయబతుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరునికృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):
ఏమిగలదిందు = ఏమున్నది ఈ జీవితంలో
ఎంత పెనగిన = ఎంత పోరాటము చేసిన
వృథా = ఫలములేదు, వ్యర్థము
కాముకపు = మాయామోహితమైన
కడమొదలు = ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తెగుతుందో
వత్తి = Wick
విత్తు = గింజ, విత్తనము
పొల్లు = కింజపైనున్న పొట్టు, తవుడు
బత్తి = భక్తి, నమ్మకం, Faith
పాసి = చెడిన, పాడైన, మలినము
పొత్తులసుఖంబులు = దేహసుఖాలు
పొరలుట = తపించడము
అరుదైన = అపూర్వమైన
లోకరంజనము = విలాసము
లోకరంజనము = లోకాన్ని సంతోషపెట్టేది
చాకిమణుగు = చాకలివాళ్ళు బట్టలు ఉతికే మడుగు
చంచలపు = స్థిరములేనిది, చంచలమైన
చేకొనిననేమి = సంపాదించితేనేమి, దాచుకొన్ననేమి
గాదె = ధాన్యము Store చేసుకోవడానికి పూర్వకాలంలో వాడబడిన మట్టి పాత్ర (ఇది cylinder shape లో ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తుంటుంద)
కర్మి = పాపముచేసినవాడు
వేదువిడువని = వెగటుకలిగించని
కూడు = ఆహారం
వెడమాయబతుకు = నీచమైన బ్రతుకు ("తూ జీవితం" అంటాం కదా?అలా అన్నమాట...)
ఏడతెగు = విడిపోవు
మోదంబు = విలాసము, సంతోషము
వడిసిన = లాగితే (వడము = త్రాడు, మోకు)
తాత్పర్యం :
ముందుమాటగ రాసినదంతా ఈ కీర్తనయొక్క తాత్పర్యమే.
ముందుమాటగ రాసినదంతా ఈ కీర్తనయొక్క తాత్పర్యమే.
=================================================
rAgaM : varALi
pallavi
Emigala diMdu neMtapenagina vRthA
kAmukapu manasunaku kaDamodalu lEdu
kAmukapu manasunaku kaDamodalu lEdu
charaNaM 1
vattilOpalinUnevaMTidi jeevanamu
vittumeedaTipollu vidhamu dEhaMbu
battisEyuTa yEmi pAsipOvuTa yEmi
vattilOpalinUnevaMTidi jeevanamu
vittumeedaTipollu vidhamu dEhaMbu
battisEyuTa yEmi pAsipOvuTa yEmi
pottulasukhaMbulaku poraluTalugAka
charaNam 2
AkASapAkASa marudaina kUTaMbu
lOkaraMjanamu tamalOnisammatamu
chAkimaNugulajADa chaMchalapu saMpadalu
chEkoninanEmi yivi chedarinanu nEmi
AkASapAkASa marudaina kUTaMbu
lOkaraMjanamu tamalOnisammatamu
chAkimaNugulajADa chaMchalapu saMpadalu
chEkoninanEmi yivi chedarinanu nEmi
charaNaM 3
gAdebOsinakoluchu karmisaMsAraMbu
vEduviDuvanikUDu veDamAyabatuku
vEdanala neDateguTa vEMkaTESwarunikRpA-
mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa
vEduviDuvanikUDu veDamAyabatuku
vEdanala neDateguTa vEMkaTESwarunikRpA-
mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa
============================
ఎంత బాగా చెప్పారు. యేవో..చికాకులతో..ఉన్న నాకు ఈ పోస్ట్ మనస్సుని నెమ్మ ళ్లిన్ప జేసింది..మానవ జీవిత అర్ధం ఏమిటో..పరమార్ధం ఏమిటో.. మనిషి కి..అన్ని జీవిత దశలలోనూ..తెలియడం అవసరం.ధన్యవాదములు భాస్కర్.
ReplyDelete//మానవ జీవిత అర్ధం ఏమిటో.. పరమార్ధం ఏమిటో.. మనిషి కి..అన్ని జీవిత దశలలోనూ..తెలియడం అవసరం.//
ReplyDeleteసరిగ్గా చెప్పారు వనజ గారూ, ధన్యవాదములు.
వ్యాఖ్యానం చాలా బాగుంది భాస్కర్ గారూ!
ReplyDeleteప్రతి ఒక్కరూ తమకు తాము అన్వయించుకోదగినదిగా ఉంది. ఇది చదివేటప్పుడు నిజాయితీ ఉన్నా చాలు, మన జీవితంలో కొన్ని అపురూప క్షణాలు ప్రోది చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది.
ధన్యవాదములు, మానస :)
ReplyDeleteఇప్పుడే ఈ బ్లాగు కొంత శ్రద్ధగా చదివాను. ప్రతిపదార్థాలు ఇవ్వడం బాగుంది. అలాగే భావం చక్కగా చెప్పావు. ఈ కీర్తనని చక్కగా స్వరపరిచారు.
ReplyDeleteచాలా బాగా రాసారు. అసలు అలా ప్రతిపదార్ధంతో పాట మొత్తం అర్ధం చెప్పడం...చాలాబాగుంది :)
ReplyDeleteyou always super brother...as usual....
ReplyDeleteభాస్కర్ గారు, ఈ కీర్తనలో అన్నమయ్య చాల చక్కగా అశాశ్వతమైన విషయ వాంఛల గురించి మనసు ఎలా తాపత్రయ పడుతుందో చెప్పారు. దానికి మీ విశ్లేషణ, వివరణ చాల బాగున్నాయి. మీలా నేను కూడ అన్నమయ్య అభిమానిని. మీ బ్లాగును తరచు చూస్తుంటాను. ఎన్నో తెలియని మాండలీక పదాలకు చక్కగా అర్ధం చెపుతూ తాత్పర్యాన్ని, దానికి మీ విశ్లేషణను జోడించి బాగా వ్రాస్తున్నారు. అభినందనలు. ఇది చక్కని కీర్తన కూడ.
ReplyDeleteఎంత బాగుందో...ఇలాంటివి చదువుతున్నపుడు..నిజంగా వేదాంతం వచ్చేస్తుంది..
ReplyDeleteకానీ మళ్లీ పని లో పడిపోతే ఇవన్నీ మర్చిపోతాం..:)
మీ పని మాత్రం అద్బుతం..నా లాంటి వాళ్ళకి ఇలాంటివి పరిచయం చేస్తున్నారు..:)