23 April 2011

Arranged Marriage చేసుకున్న అలమేలుమంగ...

శ్రీవెంకటేశుడ్ని Arranged Marriage చేసుకున్న అలమేలుమంగ మదిలోకలిగిన భావాలమీద అన్నమాచార్య రాసిన కీర్తన ఇది. 


అలమేలుమంగను చూడండి, వలపించి పెళ్ళిచేసుకోలేదని ఏమాత్రము నిట్టూర్చడంలేదు! పెద్దలు చూసి చేసిన వివాహమైతేనేం, ప్రేమ వివాహమైతేనేం? వేంకటేశుడితోనేగా జరిగినది నా పెళ్ళి అని మురిసిపోతుంది, ఈ భూలోక శ్రీదేవి. కొన్ని ముచ్చట్లు ప్రేమవివాహములోనే ఉంటాయి, మరికొన్ని పెద్దలు చూసిచేసిన వివాహములోనే ఉంటాయి. వివాహమేదైతేనేం ముచ్చట్లు మురిపించేవైనప్పుడు. ప్రేమవివాహమైతే గంటలుగంటలు తీయని కబుర్లతో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. Arranged Marriageలో తీయని సరసాలూ, చిలిపి పనులూ సాగిస్తూ మనసులు  కలుపుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. రెండిట్లోనూ ఆనందాలకు కొదవేలేదు. ఇక్కడ Arranged Marriage చేసుకున్న మహాలక్ష్మి మనసులోని భావాలు వినండి :-)============================================

రాగం : పాడి
Alternate Link for the AUDIO

============================================


పల్లవి 
దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి
చరణం 1
వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
చరణం 2 
మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
చరణం 3
పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని 

ప్రతిపదార్థం /Meaning :
దేవుల నేను = అన్నెముపుణ్యములు ఎఱుగని మగువను నేను
వావులు = వావి వరస; వియ్యము వరస
గూడగాను = కలిసాయిగనుక
వడి = వెంటనే
సేస = అక్షితలు; వివాహవేడుకవేళ వధూవరులు ఒకరిమీద ఒకరు చల్లే బియ్యం
వెట్టితి = పెట్టితిని / పోసితిని
వలపులు = ప్రేమలు
నేనెఱగ = నాకు తెలియవు
వాసులెఱగ = సంపదల విలువలు నాకు తెలియవు
కలకల = గలగలమని, గట్టిగా
కరగితిని = కరిగిపోయాను
పలుకులు = మురిపించే తీయని మాటలు,
నేనేర = నాకు తెలియవు
భావించగ = ఎంచుకోవడము, choosing the right qualities
విడెము = తాంబూలము
ప్రియమందితిని = ప్రేమ పొందాను


సాధించ = conquer, సాధించడం, గెలవడం
మర్మములు = నీ వ్యవహారములు
అడుగనోప = అడగను
చెనకి = తాకి(touch)
గోర = తొందరగా
ఊదితే = అదిమితేనే
చేకొంటిని = అంగీకరించితిని, ఆదరించితిని
పెనగ = పెనగులాడడం
బిగియగ = బిగువుచేయగ
కనువిచ్చి = కనులుతెరచి; కను సైగలతో
కానిమ్మంటిని = సరే అని ఒప్పుకున్నాను


పచ్చిచేతలు = మొరటుపనులు; మొరటుసరసాలు; gross things
రచించ = చేస్తుంటే
బలుమారు = పలుమారు; మాటిమాటికి
సిగ్గువడ = సిగ్గుపడుతుంటే
మచ్చిక = మోహముతో
గాగిలించితే = కౌగిలించితే; వాటేసుకుంటే
మరిగితిని = అలవాటుపడితిని
యిచ్చట = ఇక్కడ
యేలుకొంటివి = పరిగ్రహించితివి
ఇటు = ఈ రీతిలో
మెచ్చి = మెచ్చుకొని
మేకొని = అనుకూలించి, సహకరించి
 తాత్పర్యం ::
నువ్వు దేవుడే! అయితే నేను మాత్రం దేవతను కాను; అన్నెముపుణ్యము ఎఱుగని మామూలు మగువను నేను. మా ఇంటి పెద్దవారు "ఆతడు మనకు వరసౌతాడు. నిన్ను అతనికిచ్చి కట్టబెడుతున్నాము"  అని చెప్పారు. నేను సరే అని చెప్పి నీకు తలవంచి తాళికట్టించుకున్నాను.


"నువ్వు గొప్పింటివాడివా, నీకు సిరులున్నాయా?" లాంటివి చూసి calculativeగా మనసుపడి వలపించడం నాకు తెలియదయ్యా. నన్ను చూసి నువ్వు గలగలమని నవ్వావు! ఆ కల్లాకపటంలేని నీ నవ్వుకే పడిపోయా. అందరు అమ్మాయిల్లాగ పెళ్ళికి మునుపే కొన్నాళ్ళు నీతో స్నేహం చేసి,  నీ గురించి పూర్తిగా తెలుసుకొని, నాకు సరిపోతావా లేదా అని విశ్లేషించి, ఆ పైన అందమైన లేఖ ద్వారానో, మఱో మార్గానో I Love You అని propose చేసి, నువ్వు నా ప్రేమని అంగీకరించి, నీతో గంటలు గంటలు తీయ తీయని కబుర్లు చెప్పుకునే వలపులు నాకు తెలియవు. మన పెద్దలు తాంబూలాలు మార్చుకుని మనకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నీ ప్రేమను అందుకున్నాను.


మొగుణ్ణి వశపరుచుకునే ఉపాయాలు తెలియవు. నీ వ్యవహారలన్ని నాకెందుకు పూసగుచ్చినట్టుగా, ఆహ్లాదపరిచే విధంగా చెప్పవు అని నిందించడం నాకు తెలియదు. అలావచ్చి సైగభషతో నాకరము పట్టుకొనగానే నీమనసు గ్రహించుకుంటాను. నాయంతట నేనొచ్చి నిన్ను పెనవేసుకోను; నువ్వు వచ్చినవేళ బిగువు చేయను. కనులతో అలా అడిగితే నీ మనసు గ్రహించి సరే అని ఒప్పుకుంటాను.


వేళగానివేళలో నీ మొరటుసరసాలు ప్రదర్శించినపుడు మాటిమాటికీ సిగ్గుపడ్డాను. మోహముతో నువ్వుకౌగిలించితే ఇబ్బంది పడ్డాను. అందుకని నిన్ను విసుక్కోలేదు; నీ ఈ ప్రవర్తనలకు అలవాటుపడిపోయాను. ఓ శ్రీవెంకటేశా, ఇలాంటి స్వభాముగల నన్ను మెచ్చుకొని ఏలుకున్నావు. నీ కౌగిలి చాలు; నా జన్మ ధన్యము. మెచ్చి కౌగిలించుకున్న నీకు మనస్పూర్తిగా మొక్కుతున్నాను.


================================================
rAgaM : pADi

pallavi
dEvuDavu neevu dEvula nEnu
vAvulu gUDagAnu vaDi sEsa veTTiti

charaNaM 1
valapulu nE ne~raga vAsule~raganu - neevu
kalakala navvitEnE karagitini
palukulu nE nEra bhAvinchaga nE nEra
pilichi viDemicchitE priyamaMditini

charaNaM 2
manasu saadhiMchanOpa marmamu laDuganOpa
chenaki gOra nUditE chEkoMTini
penagajAlanu nEnu bigiyaga jAlanu
kanuvicchi chUchitEnE kAnimmaMTini

charaNaM 3
pacchichEtalu rachiMcha balumAru sigguvaDa
macchika gAgiliMchitE marigitini
yicchaTa SrIveMkaTESa yElukoMTi viTu nannu
mecchi kAgiliMchitEnu mEkoni mokkitini

================================================

21 April 2011

జలధివంటిది సుమీ చంచలపు నా మనసు...

అన్నమయ్య తన జీవితమంతా ఆ వేంకటేశుడిపైన కీర్తనలు రసేందుకే అంకితము చేసుకున్నాడు.  రాసిన 32 వేల కీర్తనలలో కొన్ని మాత్రమే ఆధ్యాత్మ  సంకీర్తనలే.  ఆ కొన్నిటిలో నాకు బాగా నచ్చిన మరో కీర్తన ఇది.  వెంకటేశుడిమీదకంటే నాకు ఆ వెంకటేశుని నిత్యము కొలిచిన ఆ అన్నమయ్యమీద నాకు భక్తెక్కువ.    అన్నమయ్య భక్తి మీద భక్తి కలుగుతుంది నాకు!  జీవితకాలమంతా ఆయన ఒక్క వెంకటేశుడిమీదే రాశాడంటే ఆయన surrendering,  dedication  మీద ఆశ్చర్యం కలుగుతుంది.  వెంకటేశుడికోశం కాదు నేను మాళ్ళీ మళ్ళీ  తిరుమలకు వెళ్ళాలనుకునేది! ఆ అన్నమయ్య కోసం!   ఆ మహాకవిని అంతగా ఆకట్టుకున్న అంశం ఆ కొండలోనే దాగుండాలి. ఏంటది? ఎక్కడుందది? అదే భక్తా?  ఏమో...  ప్రతి అన్నమయ్య కీర్తనలోనూ దాగుంది అది!  "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే అన్నమయ్య..." నేను ఒక భక్తకవిగా కొలుచుతున్నాను అన్నమయ్యని!========================================
రాగం :: ధన్నాసి
AUDIO :: అనురాధ శ్రీరాం గళములో
Alternate Link for the same AUDIO
========================================
 
పల్లవి
నాకుగలపని యిదే నారాయణుడ నీవు
శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు

చరణం 1
జలధివంటిదిసుమీ చంచలపు నామనసు
కల వింద్రియముల నేటిజలచరములు
వొలసి భక్తనెడి వోడ యెక్కితి నేనే
జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు

చరణం 2
కొండవంటిదిసుమీ కొనకెక్కు నామనసు
వుండు గామాదులను వురుమృగములు
వుండి నీశరణమనువూత గొని యెక్కితిని
కొండలప్ప నీవనేటి కొనఫలము కొరకు

చరణం 3
ఠీవులను ధరణివంటిదిసుమీ నామనసు
నీవె శ్రీవేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి
భువిభుడ నీవనేటి పురుషార్థము

ప్రతిపదార్థం / Meaning ::
నాకుగల = నాకున్న
పనియిదే = పని ఇది ఒకటే
సిద్ధించుకొరకు = దొరికేకొరకు, ఈడేఱేకొరకు

జలధి = కడలి, సముద్రము, కొలను
చంచలపు = చంచలమైన, నిలకడలేని
కలవింద్రియములు =  కలవు యింద్రియములు
ఇంద్రియములు = organs of the body
వొలసి = చేరుకొని
భక్తనెడి = భక్తి అనబడే
వోడ = నావ, boat
జలశాయి = పాలకడలిలో పవలించియున్నవాడు
నీవ నేటి = నీవు అనబడే
సరకు = వస్తువు
దెచ్చుటకు = తెచ్చుకొనుటకు

కొండ = forest
కొన = Tip, peak
గామాదులను = కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సరాలనబడేవి
వురుమృగములు = భయంకరమైన జంతువులు, పెద్ద పెద్ద జంతువులు
వుండి = ఉండి, బహుకాలము వేచి ఉండి
నీశరణమనువూత గొని = నీ శరణము అనే ఊత పట్టుకొని
కొనఫలము = పుణ్యాత్ములకు లభించే కైవల్య పదవి

ఠీవులను = డంభములు, జంభములు,  టెక్కులు show-off, style, royal
ధరణి = భూమి, ప్రపంచము
నిక్షేపము = దాచుకొన్న నిధి
వావాత = నోటిచాతుర్యముతో / ఆలపించడముతో / ???
వసిదవ్వి = వసముచేసి / dig with crow bar
కైకొంటి = పొందాను, అందుకున్నాను
భువిభుడ = భువినేలేవాడా
పురుషార్థము = మోక్షము, పరమపదము, కైవల్యము

తాత్పర్యం :
నాపుట్టుకకు అర్థం నీ పరమార్థము పొందడమే. అందువలన ఆ ధ్యేయంవైపు నడవడము తప్ప నాకింకో పనిలేదు ఈ భువిపైన. ఓ నారాయణా, శ్రీకాంతుడా నువ్వు నాకు దొరికేవరకు  నా పయణము చాలించను!

నీరెప్పుడైనా నిలకడగా ఉంటుందా? నీరు సాగరములో ఉన్నా, చెరువులో ఉన్నా చిన్న గాలి తన తనువుమీద అలా వీస్తే చాలు  అలలురేపుకుంటూ ఉంటుంది.  ఆ నీటివలే నా మనసుకుకూడా నిలకడెఱుగదు. చంచలమైనది. ఆ నీటిలో ఎలాగైతే జలచరములున్నాయో నాలోకూడా యింద్రియములనేటి జలచరాలున్నాయి. నిత్యము అవి నా మదిని చంచలపెడుతున్నాయి.  ఈ యింద్రియాలను అదుపులో పెట్టగలిగే మందు/వస్తువు నీవద్ద మాత్రమే ఉన్నది. నువ్వేమో మీ ఆత్తగారింటిలో, అంటే పాలకడలిమీద పవలించున్నావు. అక్కడికి ఈదుకుంటూ వచ్చే ధైర్యమూ, శక్తిసామర్థ్యాలూ నాకు లేదయ్యా. అందుకే భక్తి అనే ఓడనెక్కి వస్తున్నాను. నాకా ఔషదము ఇస్తావుకదూ?

కొండెలాగైతే నేనెవరికీ తలవంచను అన్నట్టు గర్వంగా నిలబడి ఉంటుందో అలా పైకెక్కి నేనే గొప్పవాడిని అంటుంది ప్రభూ నా మనసు!  కొండలో ఎలాగైతే పెద్దపెద్ద క్రూరమృగాలున్నాయో అలానే నాలో కూడా కామ క్రోధాలనే కొన్ని క్రూరమైన మృగాలున్నాయి. ఓ జగన్నాటక సూత్రథారి, నువ్వేపక్షాన ఉంటే ఆ పక్షం జయం సాధిస్తుంది. అది తెలిసేకదా అర్జునుడు నిన్ను సారధ్యము వహించమన్నాడు? నేనిప్పుడు ఈ క్రూరమృగాలవంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద,  మాత్సరాలను జయించి పరమార్థం అనే కొనఫలము దక్కించుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాపక్షానచేరి  నాకు సారథ్యము చేసిపెట్టని అడగాలనుకుంటున్నాను. ఓ కొండలప్పా, నువ్వేమో అదివో ఆ కొండైపన నిలుచున్నావు. నేనెలా చేరాలి అక్కడికి? ఇదిగో దొరికిందిలే నాకు నీ శరణ్యం అనే ఊతకఱ్ఱ. అదిపట్టుకుని వచ్చేస్తున్నా,  అంతవరకు ఎక్కడికీ వెళ్ళిపోకు!

ఓ వేంకటేశా, ఈ భువిపైనున్న ఇతరజనులవలే నా మనసుకూడా డంభాలకు, జంభాలకు బానిసై టెక్కులు చూపుతూ ఉంది. దాన్ని లొంగదీసుకునే బాధ్యత నీదని నీకర్పించాను! భువినేలేవాడా, ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా చివర్లో కావలసినదేంటి? నీ పాదశరణ్యము చేరుకునే పరమార్థమే! అది నేనెలా పొందితిననో ఎఱుగుదువుగదా? నిత్యం నీ నామమే ఆలపించుతు,  నా గానామృతపు మత్తులోకితోసి నిన్ను వసపరచుకొని  నీయండనుండే మోక్షమును పొందితినిరా అంటున్నాడు అన్నమాచర్యులవారు .
చివరి చరణానికి మరొక అర్థముకూడా ఉన్నది ::
మట్టిలో ఎలా నిధు
లు పూడ్వబడి ఉన్నాయో అలా నీలో పురుషార్థాలు నిక్షేపైమై ఉన్నాయి.   వాటిని  నీ శరణమనే గునపముతో త్రవ్వి పొందాను నీవనేటి పురుషార్థము!

 ==================================================
 rAgaM :: dhannAsi

pallavi
nAkugalapani yidE nArAyaNuDa neevu
SreekAMtuDavu nAku siddhiMchukoraku

charaNaM 1
jaladhivaMTidisumee chanchalapu nAmanasu
kala viMdriyamula nETijalacharamulu
volasi bhaktaneDi vODa yekkiti nEnE
jalaSAyi neeva nETisaraku decchuTaku

charaNaM 2
konDavaMTidisumee konakekku nAmanasu
vunDu gAmAdulanu vurumRgamulu
vunDi neeSaraNamanuvUta goni yekkitini
konDalappa neevanETi konaphalamu koraku

charaNaM 3
Theevulanu dharaNivaMTidisumee nAmanasu
neeve SreevEMkaTESa nikshEpamu
vAvAta neevanETi vasidavvi kaikonTi
bhuvibhuDa neevanETi purushArdhamu
 ==================================================

01 April 2011

పసిడిబోలినది చేపట్టెను నీ కరము...

 దేవతలూ, దానవులూ పాలకడలిని చిలికితే హాలాహలము, ఉచ్చైశ్శ్రవము, ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము, చమంతకమణి, అప్సరసలు, చందమామా ప్రభవించారు. ఆపైన అందానికీ, ఐశ్వర్యానికీ నెలవైన లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె అందాలని ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు అన్నమయ్య.
అన్నమయ్య చమత్కారం చూడండి!  కీర్తన మొదలుపెట్టినదేమో అయ్యగారిని స్తుతిస్తూ, అయితే పల్లవిలో మొదటి లైను మాత్రమే అయ్యగారి స్తుతి. రెండో లైనుకే అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టేశారు. ఇక చరణాలకొచ్చేసరికి అమ్మవారిని పొగుడుతూ రాసేశారు పాటంతా...


ఓ మాధవా, నువ్వు కేవలం పసుపు రంగు బట్టలుకట్టుకుంటావని మాత్రమే బంగారుబొమ్మలాంటి ఆ మగువ, అఖిలలోక మోహనాంగి  శ్రీమహాలక్ష్మి నీ చేయిపట్టుకుంది. (ఏదో పాపం పోనీలే అని కణికరించి నిను పెళ్ళి చేసుకుంది, లేకుంటే నీకెక్కడిదిలే అంత భాగ్యం అన్నట్టే ఉంది!)
ఓ విష్ణుమూర్తీ, ఆమే ఎవరో, ఆమె గొప్పతనమేంటో ఎఱుగుదువా? చండ్రుడికి స్వయానా చెల్లెలు! కనబడట్లేదటయ్యా ముఖాన అన్నా-చెల్లెల్ల పోలికలు? ఒక చంద్రుడికే కాదు అప్సరసలకు, శమంతకమణికీకూడా చెల్లి ఈమె. చూడు మరి ఈమె మేని తళుకులు మానికాలవలే, దంతాలవలే ఎలా మెరుస్తుందో! ఆమె నడక ఎంత వయ్యారంగా ఉందో గమనించావా? కరిగమనం అని కవులు కొనియాడతారే అలాలేదటయ్యా ఈమె నడుస్తుంటే? ప్రత్యేకించి నేర్చుకోలేదు అలా నడవటానికి. ఐరావతంకి ముద్దల చెల్లెలుకదా? ఈమె రక్తంలోనే ఉంది ఆ వయ్యారమైన నడక!  ఓ పురుషోత్తమా, ఆమెకు నీ మీద కోపం వచ్చి అలిగిపోతుందికదా, అప్పుడు ఆమె అలకతీర్చేందుకి కాళ్ళుపట్టుకుంటావే అప్పుడు ఆ పాదాలను పరీక్షించావా? ఎలా ఉన్నాయి ఆ పాదాలు?  పారిజాతపువ్వులోని రేకుళ్ళా లేవూ? చిగురులాంటి పాదాలుగల ఈ మగువ పారిజాత పుష్పానికి చెల్లి!
ఈమె జనించినపుడు ప్రజాపతి కానుకగా పద్మం ఇచ్చాడు. ఆ పద్మాన్ని ఆసనంగా చేసుకుందిగనుకే ఈమె కన్నులు తామెరల్లా ఉన్నాయి. ఇన్ని నాణ్యమైన అంసాలతో పుట్టిన ఈమె నిన్ను వరించిందంటే నిజంగా నీ అదృష్టమేరా, వేంకటేశా! ఇంతటి గొప్ప ఇంతి నీమేనంటి ఉంటానంటుంది! ఇంతకన్నా నీకు కావలసినది ఏముంది?
==========================
రాగం :: బౌళి
జానకి గారి గళంలో
Alternate Link
===========================
పల్లవి
పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన
పసిడిబోలినది చేపట్టెను నీకరము

చరణం 1
తొలుతనే చందురుని తోడబుట్టుగనక
పొలుపు చందురు మోముపోలికైనది
కళల చింతామణి కందువ చెల్లెలుగాన
తళుకు మానికపు దంతముల బోలినది

చరణం 2
మంచి యైరావతముతుతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనము బోలినది
పంచల బారిజాతపు భావపు సోదరిగాన
యెంచగ చిగురుబోలె నీకెపాదములు

చరణం 3
తామెర తోట్టెలలోన తగిలి తానుండుగాన
తామెరకన్నులబోలి తనరినది
యీమేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది
 
ప్రతిపదార్థం / Meaning :
పసిడి = బంగారు
కరము = చేయి
పొలుపు = అందమైన, సొంపైన
చింతామణి =
శమంతకమణి
కందువ = జాడలున్న
కరి = ఏనుగు
పంచల = పంచలక్షణములుగల(పంచలక్షణములు -సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము)

================================================

rAgaM : bouLi

pallavi
pasiDicheeravADavu pAludacchitivigAna
pasiDibOlinadi chEpaTTenu neekaramu

charaNaM 1
tolutanE chanduruni tODabuTTuganaka
polupu chaMduru mOmupOlikainadi
kaLala chintaamaNi kaMduva chellelugAna
taLuku mAnikapu daMtamula bOlinadi


charaNaM 2
maMchi yairAvatamututO maguva saidODugAna
muMchina karigamanamu bOlinadi
paMchala bArijAtapu bhAvapu sOdarigAna
yeMchaga chigurubOle neekepAdamulu

charaNaM 3
tAmera tOTTelalOna tagili tAnunDugAna
tAmerakannulabOli tanarinadi
yeemEra ninniTA bOli inni lakshaNamulatO
neemEna SreevEMkaTESa nelavai nilchinadi

================================================