అన్నమయ్య తన జీవితమంతా ఆ వేంకటేశుడిపైన కీర్తనలు రసేందుకే అంకితము చేసుకున్నాడు. రాసిన 32 వేల కీర్తనలలో మనకు దొరికినవి సుమారు పదిహేనువేలు కీర్తనలే. వాటిలో సుమారు రెండువేలా ఐదువందలు మాత్రమే ఆధ్యాత్మ సంకీర్తనలే. ఆ కొన్ని ఆధ్యాత్మ కీర్తనల్లో 'నాకుగలపని యిదే నారాయణుడ...' అనే కీర్తన చూద్దాం. అన్నమయ్య తన జీవితకాలమంతా ఒక్క వెంకటేశుడిమీదే కీర్తనలు రాశాడంటే ఆ భక్తి, అంకితభావాలెంత గొప్పవో! దేవుడిమీద భక్తిలేకున్నా సరే సాహిత్య, సంగీతాలను ఆస్వాదించేవారికి అన్నమయ్య మీద భక్తి కలగకమానదు. ఆ మహాకవిని అంతగా ఆకట్టుకున్న అంశం ఆ కొండలోనే దాగుండాలి! ఏంటది? ఎక్కడుందది? అదే భక్తా? ఏమో... ప్రతి అన్నమయ్య కీర్తనలోనూ దాగుండకపోదు ఆ రహస్యం! "ఎంతమాత్రమున ఎవ్వరు చదివిన అంతమాత్రమే అన్నమయ్య!"
========================================
========================================
పల్లవి
నాకుగలపని యిదే నారాయణుడ నీవు
శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు
చరణం 1
జలధివంటిదిసుమీ చంచలపు నామనసు
కల వింద్రియముల నేటిజలచరములు
వొలసి భక్తనెడి వోడ యెక్కితి నేనే
జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు
చరణం 2
కొండవంటిదిసుమీ కొనకెక్కు నామనసు
వుండు గామాదులను వురుమృగములు
వుండి నీశరణమనువూత గొని యెక్కితిని
కొండలప్ప నీవనేటి కొనఫలము కొరకు
చరణం 3
ఠీవులను ధరణివంటిదిసుమీ నామనసు
నీవె శ్రీవేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి
భువిభుడ నీవనేటి పురుషార్థము
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
నాకుగల = నాకున్న
పనియిదే = పని ఇది ఒకటే
సిద్ధించుకొరకు = దొరికేకొరకు, ఈడేఱేకొరకు
జలధి = కడలి, సముద్రము, కొలను
చంచలపు = చంచలమైన, నిలకడలేని
కలవింద్రియములు = కలవు యింద్రియములు
ఇంద్రియములు = organs of the body
వొలసి = చేరుకొని
భక్తనెడి = భక్తి అనబడే
వోడ = నావ, boat
జలశాయి = పాలకడలిలో పవలించియున్నవాడు
నీవ నేటి = నీవు అనబడే
సరకు = వస్తువు
దెచ్చుటకు = తెచ్చుకొనుటకు
కొండ = forest
కొన = Tip, peak
గామాదులను = కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సరాలనబడేవి
వురుమృగములు = భయంకరమైన జంతువులు, పెద్ద పెద్ద జంతువులు
వుండి = ఉండి, బహుకాలము వేచి ఉండి
నీశరణమనువూత గొని = నీ శరణము అనే ఊత పట్టుకొని
కొనఫలము = పుణ్యాత్ములకు లభించే కైవల్య పదవి
ఠీవులను = డంభములు, జంభములు, టెక్కులు show-off, style, royal
ధరణి = భూమి, ప్రపంచము
నిక్షేపము = దాచుకొన్న నిధి
వావాత = నోటిచాతుర్యముతో / ఆలపించడముతో / ???
వసిదవ్వి = వసముచేసి / dig with crow bar
కైకొంటి = పొందాను, అందుకున్నాను
భువిభుడ = భువినేలేవాడా
పురుషార్థము = మోక్షము, పరమపదము, కైవల్యము
తాత్పర్యం :
నాపుట్టుకకు అర్థం నీ పరమార్థము పొందడమే. అందువలన ఆ ధ్యేయంవైపు నడవడము తప్ప నాకింకో పనిలేదు ఈ భువిపైన. ఓ నారాయణా, శ్రీకాంతుడా నువ్వు నాకు దొరికేవరకు నా పయణము చాలించను!
నీరెప్పుడైనా నిలకడగా ఉంటుందా? నీరు సాగరములో ఉన్నా, చెరువులో ఉన్నా చిన్న గాలి తన తనువుమీద అలా వీస్తే చాలు అలలురేపుకుంటూ ఉంటుంది. ఆ నీటివలే నా మనసుకుకూడా నిలకడెఱుగదు. చంచలమైనది. ఆ నీటిలో ఎలాగైతే జలచరములున్నాయో నాలోకూడా యింద్రియములనేటి జలచరాలున్నాయి. నిత్యము అవి నా మదిని చంచలపెడుతున్నాయి. ఈ యింద్రియాలను అదుపులో పెట్టగలిగే మందు/వస్తువు నీవద్ద మాత్రమే ఉన్నది. నువ్వేమో మీ ఆత్తగారింటిలో, అంటే పాలకడలిమీద పవలించున్నావు. అక్కడికి ఈదుకుంటూ వచ్చే ధైర్యమూ, శక్తిసామర్థ్యాలూ నాకు లేదయ్యా. అందుకే భక్తి అనే ఓడనెక్కి వస్తున్నాను. నాకా ఔషదము ఇస్తావుకదూ?
కొండెలాగైతే నేనెవరికీ తలవంచను అన్నట్టు గర్వంగా నిలబడి ఉంటుందో అలా పైకెక్కి నేనే గొప్పవాడిని అంటుంది ప్రభూ నా మనసు! కొండలో ఎలాగైతే పెద్దపెద్ద క్రూరమృగాలున్నాయో అలానే నాలో కూడా కామ క్రోధాలనే కొన్ని క్రూరమైన మృగాలున్నాయి. ఓ జగన్నాటక సూత్రథారి, నువ్వేపక్షాన ఉంటే ఆ పక్షం జయం సాధిస్తుంది. అది తెలిసేకదా అర్జునుడు నిన్ను సారధ్యము వహించమన్నాడు? నేనిప్పుడు ఈ క్రూరమృగాలవంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సరాలను జయించి పరమార్థం అనే కొనఫలము దక్కించుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాపక్షానచేరి నాకు సారథ్యము చేసిపెట్టమని అడగాలనుకుంటున్నాను. ఓ కొండలప్పా, నువ్వేమో అదివో ఆ కొండైపన నిలుచున్నావు. నేనెలా చేరాలి అక్కడికి? ఇదిగో దొరికిందిలే నాకు నీ శరణ్యం అనే ఊతకఱ్ఱ. అదిపట్టుకుని వచ్చేస్తున్నా, అంతవరకు ఎక్కడికీ వెళ్ళిపోకు!
ఓ వేంకటేశా, ఈ భువిపైనున్న ఇతరజనులవలే నా మనసుకూడా డంభాలకు, జంభాలకు బానిసై టెక్కులు చూపుతూ ఉంది. దాన్ని లొంగదీసుకునే బాధ్యత నీదని నీకర్పించాను! భువినేలేవాడా, ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా చివర్లో కావలసినదేంటి? నీ పాదశరణ్యము చేరుకునే పరమార్థమే! అది నేనెలా పొందితిననో ఎఱుగుదువుగదా? నిత్యం నీ నామమే ఆలపించుతు, నా గానామృతపు మత్తులోకితోసి నిన్ను వసపరచుకొని నీయండనుండే మోక్షమును పొందితినిరా అంటున్నాడు అన్నమాచర్యులవారు .

చివరి చరణానికి మరొక అర్థముకూడా ఉన్నది ::
మట్టిలో ఎలా నిధులు పూడ్వబడి ఉన్నాయో అలా నీలో పురుషార్థాలు నిక్షేపైమై ఉన్నాయి. వాటిని నీ శరణమనే గునపముతో త్రవ్వి పొందాను నీవనేటి పురుషార్థము!
మట్టిలో ఎలా నిధులు పూడ్వబడి ఉన్నాయో అలా నీలో పురుషార్థాలు నిక్షేపైమై ఉన్నాయి. వాటిని నీ శరణమనే గునపముతో త్రవ్వి పొందాను నీవనేటి పురుషార్థము!
==================================================
rAgaM :: dhannAsi
pallavi
nAkugalapani yidE nArAyaNuDa neevu
SreekAMtuDavu nAku siddhiMchukoraku
charaNaM 1
jaladhivaMTidisumee chanchalapu nAmanasu
kala viMdriyamula nETijalacharamulu
volasi bhaktaneDi vODa yekkiti nEnE
jalaSAyi neeva nETisaraku decchuTaku
charaNaM 2
konDavaMTidisumee konakekku nAmanasu
vunDu gAmAdulanu vurumRgamulu
vunDi neeSaraNamanuvUta goni yekkitini
konDalappa neevanETi konaphalamu koraku
charaNaM 3
Theevulanu dharaNivaMTidisumee nAmanasu
neeve SreevEMkaTESa nikshEpamu
vAvAta neevanETi vasidavvi kaikonTi
bhuvibhuDa neevanETi purushArdhamu

No comments:
Post a Comment