దేవతలూ, దానవులూ పాలకడలిని చిలికితే హాలాహలము, ఉచ్చైశ్శ్రవము, ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము, చమంతకమణి, అప్సరసలు, చందమామా ప్రభవించారు. ఆపైన అందానికీ, ఐశ్వర్యానికీ నెలవైన లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె అందాలని ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు అన్నమయ్య.
అన్నమయ్య చమత్కారం చూడండి! కీర్తన మొదలుపెట్టినదేమో అయ్యగారిని స్తుతిస్తూ, అయితే పల్లవిలో మొదటి లైను మాత్రమే అయ్యగారి స్తుతి. రెండో లైనుకే అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టేశారు. ఇక చరణాలకొచ్చేసరికి అమ్మవారిని పొగుడుతూ రాసేశారు పాటంతా...
ఓ మాధవా, నువ్వు కేవలం పసుపు రంగు బట్టలుకట్టుకుంటావని మాత్రమే బంగారుబొమ్మలాంటి ఆ మగువ, అఖిలలోక మోహనాంగి శ్రీమహాలక్ష్మి నీ చేయిపట్టుకుంది. (ఏదో పాపం పోనీలే అని కణికరించి నిను పెళ్ళి చేసుకుంది, లేకుంటే నీకెక్కడిదిలే అంత భాగ్యం అన్నట్టే ఉంది!)
ఓ విష్ణుమూర్తీ, ఆమే ఎవరో, ఆమె గొప్పతనమేంటో ఎఱుగుదువా? చండ్రుడికి స్వయానా చెల్లెలు! కనబడట్లేదటయ్యా ముఖాన అన్నా-చెల్లెల్ల పోలికలు? ఒక చంద్రుడికే కాదు అప్సరసలకు, శమంతకమణికీకూడా చెల్లి ఈమె. చూడు మరి ఈమె మేని తళుకులు మానికాలవలే, దంతాలవలే ఎలా మెరుస్తుందో! ఆమె నడక ఎంత వయ్యారంగా ఉందో గమనించావా? కరిగమనం అని కవులు కొనియాడతారే అలాలేదటయ్యా ఈమె నడుస్తుంటే? ప్రత్యేకించి నేర్చుకోలేదు అలా నడవటానికి. ఐరావతంకి ముద్దల చెల్లెలుకదా? ఈమె రక్తంలోనే ఉంది ఆ వయ్యారమైన నడక! ఓ పురుషోత్తమా, ఆమెకు నీ మీద కోపం వచ్చి అలిగిపోతుందికదా, అప్పుడు ఆమె అలకతీర్చేందుకి కాళ్ళుపట్టుకుంటావే అప్పుడు ఆ పాదాలను పరీక్షించావా? ఎలా ఉన్నాయి ఆ పాదాలు? పారిజాతపువ్వులోని రేకుళ్ళా లేవూ? చిగురులాంటి పాదాలుగల ఈ మగువ పారిజాత పుష్పానికి చెల్లి!
ఈమె జనించినపుడు ప్రజాపతి కానుకగా పద్మం ఇచ్చాడు. ఆ పద్మాన్ని ఆసనంగా చేసుకుందిగనుకే ఈమె కన్నులు తామెరల్లా ఉన్నాయి. ఇన్ని నాణ్యమైన అంసాలతో పుట్టిన ఈమె నిన్ను వరించిందంటే నిజంగా నీ అదృష్టమేరా, వేంకటేశా! ఇంతటి గొప్ప ఇంతి నీమేనంటి ఉంటానంటుంది! ఇంతకన్నా నీకు కావలసినది ఏముంది?
==========================
రాగం :: బౌళి
===========================
పల్లవి
పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన
పసిడిబోలినది చేపట్టెను నీకరము
చరణం 1
తొలుతనే చందురుని తోడబుట్టుగనక
పొలుపు చందురు మోముపోలికైనది
కళల చింతామణి కందువ చెల్లెలుగాన
తళుకు మానికపు దంతముల బోలినది
చరణం 2
మంచి యైరావతముతుతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనము బోలినది
పంచల బారిజాతపు భావపు సోదరిగాన
యెంచగ చిగురుబోలె నీకెపాదములు
చరణం 3
తామెర తోట్టెలలోన తగిలి తానుండుగాన
తామెరకన్నులబోలి తనరినది
యీమేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు) :
పసిడి = బంగారు
కరము = చేయి
పొలుపు = అందమైన, సొంపైన
చింతామణి = శమంతకమణి
కందువ = జాడలున్న
కరి = ఏనుగు
పంచల = పంచలక్షణములుగల(పంచలక్షణములు -సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము)
పసిడి = బంగారు
కరము = చేయి
పొలుపు = అందమైన, సొంపైన
చింతామణి = శమంతకమణి
కందువ = జాడలున్న
కరి = ఏనుగు
పంచల = పంచలక్షణములుగల(పంచలక్షణములు -సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము)
================================================
rAgaM : bouLi
pallavi
pasiDicheeravADavu pAludacchitivigAna
pasiDibOlinadi chEpaTTenu neekaramu
charaNaM 1
tolutanE chanduruni tODabuTTuganaka
polupu chaMduru mOmupOlikainadi
kaLala chintaamaNi kaMduva chellelugAna
taLuku mAnikapu daMtamula bOlinadi
charaNaM 2
maMchi yairAvatamututO maguva saidODugAna
muMchina karigamanamu bOlinadi
paMchala bArijAtapu bhAvapu sOdarigAna
yeMchaga chigurubOle neekepAdamulu
charaNaM 3
tAmera tOTTelalOna tagili tAnunDugAna
tAmerakannulabOli tanarinadi
yeemEra ninniTA bOli inni lakshaNamulatO
neemEna SreevEMkaTESa nelavai nilchinadi
================================================
audio :
ReplyDeletehttp://www.esnips.com/doc/bdac8350-f9fe-4ddd-bdfd-b1aac5a734b3/PASIDI-CHEERA-VAADAVU
Thanks for the working link, Sravan! I have linked put your audio link now.
ReplyDelete