శ్రీవెంకటేశుడ్ని Arranged Marriage చేసుకున్న అలమేలుమంగ మదిలోకలిగిన భావాలమీద అన్నమాచార్య రాసిన కీర్తన ఇది.
అలమేలుమంగను చూడండి, వలపించి పెళ్ళిచేసుకోలేదని ఏమాత్రము నిట్టూర్చడంలేదు! పెద్దలు చూసి చేసిన వివాహమైతేనేం, ప్రేమ వివాహమైతేనేం? వేంకటేశుడితోనేగా జరిగినది నా పెళ్ళి అని మురిసిపోతుంది, ఈ భూలోక శ్రీదేవి. కొన్ని ముచ్చట్లు ప్రేమవివాహములోనే ఉంటాయి, మరికొన్ని పెద్దలు చూసిచేసిన వివాహములోనే ఉంటాయి. వివాహమేదైతేనేం ముచ్చట్లు మురిపించేవైనప్పుడు. ప్రేమవివాహమైతే గంటలుగంటలు తీయని కబుర్లతో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. Arranged Marriageలో తీయని సరసాలూ, చిలిపి పనులూ సాగిస్తూ మనసులు కలుపుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. రెండిట్లోనూ ఆనందాలకు కొదవేలేదు. ఇక్కడ Arranged Marriage చేసుకున్న మహాలక్ష్మి మనసులోని భావాలు వినండి :-)
============================================
రాగం : పాడి
Alternate Link for the AUDIO
============================================
పల్లవి
దేవుడవు నీవు దేవుల నేను
వావులు గూడగాను వడి సేస వెట్టితి
చరణం 1
వలపులు నే నెఱగ వాసులెఱగను - నీవు
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నే నేర భావించగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
చరణం 2
మనసు సాధించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగ జాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
చరణం 3
పచ్చిచేతలు రచించ బలుమారు సిగ్గువడ
మచ్చిక గాగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవెంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):
దేవుల నేను = అన్నెముపుణ్యములు ఎఱుగని మగువను నేను
వావులు = వావి వరస; వియ్యము వరస
గూడగాను = కలిసాయిగనుక
వడి = వెంటనే
సేస = అక్షితలు; వివాహవేడుకవేళ వధూవరులు ఒకరిమీద ఒకరు చల్లే బియ్యం
వెట్టితి = పెట్టితిని / పోసితిని
వలపులు = ప్రేమలు
నేనెఱగ = నాకు తెలియవు
వాసులెఱగ = సంపదల విలువలు నాకు తెలియవు
కలకల = గలగలమని, గట్టిగా
కరగితిని = కరిగిపోయాను
పలుకులు = మురిపించే తీయని మాటలు,
నేనేర = నాకు తెలియవు
భావించగ = ఎంచుకోవడము, choosing the right qualities
విడెము = తాంబూలము
ప్రియమందితిని = ప్రేమ పొందాను
సాధించ = conquer, సాధించడం, గెలవడం
మర్మములు = నీ వ్యవహారములు
అడుగనోప = అడగను
చెనకి = తాకి(touch)
గోర = తొందరగా
ఊదితే = అదిమితేనే
చేకొంటిని = అంగీకరించితిని, ఆదరించితిని
పెనగ = పెనగులాడడం
బిగియగ = బిగువుచేయగ
కనువిచ్చి = కనులుతెరచి; కను సైగలతో
కానిమ్మంటిని = సరే అని ఒప్పుకున్నాను
పచ్చిచేతలు = మొరటుపనులు; మొరటుసరసాలు; gross things
రచించ = చేస్తుంటే
బలుమారు = పలుమారు; మాటిమాటికి
సిగ్గువడ = సిగ్గుపడుతుంటే
మచ్చిక = మోహముతో
గాగిలించితే = కౌగిలించితే; వాటేసుకుంటే
మరిగితిని = అలవాటుపడితిని
యిచ్చట = ఇక్కడ
యేలుకొంటివి = పరిగ్రహించితివి
ఇటు = ఈ రీతిలో
మెచ్చి = మెచ్చుకొని
మేకొని = అనుకూలించి, సహకరించి
తాత్పర్యం ::
నువ్వు దేవుడే! అయితే నేను మాత్రం దేవతను కాను; అన్నెముపుణ్యము ఎఱుగని మామూలు మగువను నేను. మా ఇంటి పెద్దవారు "ఆతడు మనకు వరసౌతాడు. నిన్ను అతనికిచ్చి కట్టబెడుతున్నాము" అని చెప్పారు. నేను సరే అని చెప్పి నీకు తలవంచి తాళికట్టించుకున్నాను.
"నువ్వు గొప్పింటివాడివా, నీకు సిరులున్నాయా?" లాంటివి చూసి calculativeగా మనసుపడి వలపించడం నాకు తెలియదయ్యా. నన్ను చూసి నువ్వు గలగలమని నవ్వావు! ఆ కల్లాకపటంలేని నీ నవ్వుకే పడిపోయా. అందరు అమ్మాయిల్లాగ పెళ్ళికి మునుపే కొన్నాళ్ళు నీతో స్నేహం చేసి, నీ గురించి పూర్తిగా తెలుసుకొని, నాకు సరిపోతావా లేదా అని విశ్లేషించి, ఆ పైన అందమైన లేఖ ద్వారానో, మఱో మార్గానో I Love You అని propose చేసి, నువ్వు నా ప్రేమని అంగీకరించి, నీతో గంటలు గంటలు తీయ తీయని కబుర్లు చెప్పుకునే వలపులు నాకు తెలియవు. మన పెద్దలు తాంబూలాలు మార్చుకుని మనకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నీ ప్రేమను అందుకున్నాను.
మొగుణ్ణి వశపరుచుకునే ఉపాయాలు తెలియవు. నీ వ్యవహారలన్ని నాకెందుకు పూసగుచ్చినట్టుగా, ఆహ్లాదపరిచే విధంగా చెప్పవు అని నిందించడం నాకు తెలియదు. అలావచ్చి సైగభషతో నాకరము పట్టుకొనగానే నీమనసు గ్రహించుకుంటాను. నాయంతట నేనొచ్చి నిన్ను పెనవేసుకోను; నువ్వు వచ్చినవేళ బిగువు చేయను. కనులతో అలా అడిగితే నీ మనసు గ్రహించి సరే అని ఒప్పుకుంటాను.
వేళగానివేళలో నీ మొరటుసరసాలు ప్రదర్శించినపుడు మాటిమాటికీ సిగ్గుపడ్డాను. మోహముతో నువ్వుకౌగిలించితే ఇబ్బంది పడ్డాను. అందుకని నిన్ను విసుక్కోలేదు; నీ ఈ ప్రవర్తనలకు అలవాటుపడిపోయాను. ఓ శ్రీవెంకటేశా, ఇలాంటి స్వభాముగల నన్ను మెచ్చుకొని ఏలుకున్నావు. నీ కౌగిలి చాలు; నా జన్మ ధన్యము. మెచ్చి కౌగిలించుకున్న నీకు మనస్పూర్తిగా మొక్కుతున్నాను.

================================================rAgaM : pADi
pallavi
dEvuDavu neevu dEvula nEnu
vAvulu gUDagAnu vaDi sEsa veTTiti
charaNaM 1valapulu nE ne~raga vAsule~raganu - neevu
kalakala navvitEnE karagitini
palukulu nE nEra bhAvinchaga nE nEra
pilichi viDemicchitE priyamaMditini
charaNaM 2manasu saadhiMchanOpa marmamu laDuganOpa
chenaki gOra nUditE chEkoMTini
penagajAlanu nEnu bigiyaga jAlanu
kanuvicchi chUchitEnE kAnimmaMTinicharaNaM 3pacchichEtalu rachiMcha balumAru sigguvaDa
macchika gAgiliMchitE marigitini
yicchaTa SrIveMkaTESa yElukoMTi viTu nannu
mecchi kAgiliMchitEnu mEkoni mokkitini
================================================
bagundi mee krushi,,maaku teliyani annamayya patalu vatiki ardham chepparu,,thanx
ReplyDeleteThanks Manu gaaru, for your kind words.. keep reading.
ReplyDeleteభాస్కర్ గారు - భలే ఉంది..:)..ఫొటోస్ కూడా బాగున్నాయి..
ReplyDeletebrother..good work..
ReplyDeletesee here too the same samkirtana..
http://balantrapuvariblog.blogspot.com/2011/02/annamayya-samkirtanalutatwamulu_2693.html
god bless you...
చాలా చక్కగా ఉంది. అభినందనలు
ReplyDelete@kiran :: Thanks kiraN. aa photo lu internet nunchi teesukunnaa..
ReplyDelete@confident girl :: Akka, thanks. PSR gaaru E raagamlO swaraparichaarO teliyadigaani, annamayya maatraM aa keertanani "pADi" raagaMlOnE raaSaaru. andukE "pADi" ani peTTESaa. meeru kanukkuni cheppanDi :-)
కొత్త పాళీ గారూ, మీ అభిమానానికి దన్యవాధములండి!
పామరులకు సైతం అర్ధం అయ్యే రీతిగా.. అన్నమయ్య సంకీర్తనలకు అర్ధం వివరిస్తున్నారు.. చాలా బాగుందండీ.. మీ ప్రయత్నం. మీకు వీలు కల్గినప్పుడు "పాలికాడివట అందరికి","వనమాలి".. కీర్తనలకి .. అర్ధ తాత్పర్యములు వివరించండీ..
ReplyDeleteచాలా బాగుంది. భాస్కర్ గారు. నెనర్లు.
ReplyDelete