11 March 2011

బంగారువోడ కంటే పట్టనాశ పుట్టుగాని...



"ఈ భువీపై ఉన్నంత కాలమూ మానవుడు కర్మలు చెయ్యవలసినదే" అని ప్రబోధించినవాడు దేవుడే! అలా మనం చేసే ఆ కర్మలలో ఎంతవరకు ధర్మమార్గాన చేస్తున్నాం, తెలిసో తెలియకో అధర్మాలూ, పాపాలూ చేస్తున్నామా అన్నది శొధించుకోవాలంటున్నాడు అన్నమయ్య.

ఒకవేళ మనం పాపాలు చేస్తుంటే, అధర్మపథం తొక్కుతుంటే అలా ఎందుకు జరుగుతూందో ఆలోచించమంటున్నాడు! మన చుట్టూవున్న వాతావరణం మన ప్రవర్తనలపై, మనసుపై ఎంత ప్రభావాన్ని కలిగిస్తుందో ఈ కీర్తనలో చెప్తున్నాడు.

మండే అగ్నిజ్వాలల పక్కన నిలుచున్నవాడికి ఎలాగైతే చల్లదనం దూరమౌతుందో అలాగే, ఇల్లునీ, ఇల్లాలినీ మరచి వేశ్యలవాడలో చెలువలచుట్టు తిరుగుతువుండే సంసారికి ఎటువంటి గొప్పగుణమూ, సంస్కారమూ లభించవు.

ఎంత చదివితేనేమి, ఎంత జ్ఞానము పొందితేనేమి? సమయోచితముగా ఆ జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకోనప్పుడు ఆ జ్ఞానమంతా వృథాయే కదా? జీవులన్నవి రక్తమాంసాలతోనే తిరుగుతుంటాయి అన్న విజ్ఞానము తెలిసినా, బంగారుజింక అలా కనులముందర పరిగెడితే అదేదో మాయ అని పసిగట్టలేక పట్టుకురమ్మనే ఆశ ఇబ్బందులకే దారి తీస్తుంది. (అత్యాశ కూడదు అన్నది దీని పరమార్థం)! సాధారణంగానే మూర్ఖుడి ప్రవర్తనలు తేడాగా ఉంటుంది! అటువంటీవాడు అభిని(సారాయిలాంటిది - Drug) తింటే ఇంక వెర్రివేషాలేగా వేస్తాడు? ఇక్కడ అన్నమయ్య సూచించేదేమిటంటే, మనం దేన్ని స్పూర్తిదాయకంగా(ఆదర్శముగా) ఎన్నుకుంటామో దాన్నిబట్టే మన నడవడికలు సాగుతాయి. మంచివాటికి inspire అయినపుడే మనసు ధర్మమార్గంవైపు నడిపిస్తుంది! చెడుని inspirationగా తీసుకుంటే ఇక బ్రతుకు అభిని తిన్న మారుతే!!

శ్రీవేంకటేశపథంచేరి భక్తిమార్గమనాచరించువారికి మంచి చెడుల తేడాలు తెలుస్తాయి. పాపములు చేయబోరు! అట్టివారిని కష్టాలంటవు. సౌఖ్యాలే చేకూరుతాయి. హరిభక్తి అమృతము తాగినజనులు రోగాలేవీలేక చిరంజీవిగా జీవిస్తారు. 

తప్పొప్పులు చేయకుండా ధర్మమార్గాన జీవితం సాగించేవాడికి హాయిగా నిద్రపడుతుంది. వేళకు ఆకలివేస్తుంది. Stress ఉండదు. Hormones balanced గా ఉంటాయి. రోగాలేవి అంటకుండా వందేళ్ళు హాయిగా జీవించగలడు. అలాకాకుండ ఇతరులను కూల్చేయాలి, scamలు చేసి డబ్బులు కూడబెట్టేయాలి అనుకున్న వారికి నిద్రపట్టదు - ఎంతసేపైనా కుళ్ళు కుతంత్రాలే! పాడు ఆలోచనలు తొలిచేస్తూ ఉంటుంది మనసుని. నిద్రుండదు, ఆహారం అరగదు, కొవ్వు కరగదు. Stress పెరిగిపోయి రోగాలవరదలో కొట్టుకుపోతారు!

========================

రాగం : కాంబోది 

========================


కర్మమెంత మర్మమెంత కలిగిన కాలమందు
ధర్మమిది యేమరక తలచవో మనసా


చెలువల పొంతనుంటే చిత్తమే చెదురుగాని
కలుగనేర దెంతైనా ఘనవిరతి
ఉలుక కగ్గి పొంతనుంటే గాకలేకాక
చలువ గలుగునా సంసారులకునూ


బంగారువోడ(లేడి) గంటే బట్టనాశ పుట్టుగాని
సంగతి విజ్ఞానపుజాడకు రాదు
వెంగలి అభిని తింటే వెర్రి వెర్రాటాడుగాని
అంగవించునా వివేకము అప్పుడే లోకులకు


శ్రీవేంకటేశుభక్తి చేరితే సౌఖ్యముగాని
ఆవల నంటవు పాపా లతిదుఃఖాలు
చేవ నమృతముగొంటే చిరంజీవియగునుగాని
చావులేదు నోవులేదు సర్వజ్ఞలకును

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు) :

ఏమరక = మోసపోకుండ/మరిచిపోకుండ

చెలువల = కవ్వించే అందమైన మగువల
పొంత = సమీపమున, దగ్గర
చిత్తము = బుద్ది / intelligence
చెదరు = distract, scatter
ఘనవిరతి = గొప్పవారికున్న మనోస్థితి / మనసునిలకడ, Maturity
ఉలుక కగ్గి = సెగలుకక్కే అగ్గి,  frightening fire
గాక / కాక = వేడి
చలువ = చల్లదనం

ఓడ = పడవ, నావ, ship
వెంగలి / వెంగళి = మూఢుడు, అవివేకి, కోతి, stupid person
అభిని = opium, నల్లమందు
అంగవించున = చేకొనునా, కలుగునా

ఆవల = ఆపైన, తరువాత
నోవు = రోగము, వ్యాధి, బాధ


==================================================

rAgam : kAmbOdi

==================================================


pallavi
karmamenta marmamenta kaligina kaalamandu
dharmamidi yEmaraka talachavO manasA

charaNaM 1
cheluvala pontanunTE chittamE chedurugaani
kaluganEra dentainaa ghanavirati
uluka kaggi pontanunTE gaakalEkaaka
chaluva galugunaa samsaarulakunU

charaNaM 2
bangaaruvODa ganTE baTTanASa puTTugaani
(bangaarulEDi gaMTE baTTanASa puTTugaani)
sangati vij~nAnapujaaDaku raadu
veMgali abhini tiMTE verri verraaTaaDugaani
angaviMchunaa vivEkamu appuDE lOkulaku

charaNaM 3
SreevEMkaTESubhakti chEritE soukhyamugaani
aavala naMTavu paapaa latidu@hkhalu 
chEva naMRtamugoMTE chiranjeeviyagunugaani
chaavulEdu nOvulEdu sarvaj~nalakunu

=======================================================

1 comment: