అన్నమయ్య
రాయని భావంలేదు. కీర్తనల్లోని భావాలు జీవితానికి ఉపయోగపడే పాఠాలుగానో,
జీవితంలో ఎదుర్కొన్న గమ్మత్తయిన సంఘటనలుగానో ఉంటాయి. ఇది రాశాడు, ఇది
రాయలేదని లేదు. రాసిన ప్రతిభావంలోనూ ఆ స్వామినే కీర్తించాడు, స్వామినే
పోల్చాడు, అన్వయించాడు. స్వామివారి అన్ని లీలలనీ కీర్తనల్లో భావాలుగాచేసిన
గొప్ప భక్తి అన్నమయ్యది.
ఈ కీర్తనలో శ్రీదేవీ పురుషోత్తములను యౌవనప్రాయమొచ్చిన బావామరదళ్ళుగా ఊహించుకున్నారు. మనసులు కలసిన ప్రేమికులు దొంగచాటుగా కలుసుకోవడం, కబుర్లుచెప్పుకోవడం వలపుధర్మంకదా? పెద్దలు పెట్టిన ముహూర్తంవరకు ఆగమంటే కుదురులేని మనసులు వింటాయా? ఒకరికై ఒకరు తపిస్తుంటారు. అయ్యవారేమో పదే పదే కలవాలని సైగలతో సందేశం ఇస్తుంటారు. ఆయనకు కుదిరినంత సులువుగా ఆమెకు కుదరద్దూ? ఎందరి కన్నులు కప్పి రావాలో. ఇన్నీ దాటుకుని ఆమె వచ్చినా అయ్యవారేమో "నీకు నామీద ప్రేమేలేదు; నన్ను చూడాలనే నీకు తోచదు" అని నిందిస్తున్నారు. నా పొందుకు నువ్వెంత పరితపిస్తున్నావో, నీ పొందుకు నేనూ అంతే పరితపిస్తున్నాననీ, కలుసుకోడంలో తనకున్న కష్టాలు ఇవీయని చెప్తున్నారు అమ్మవారు.
ఈ కీర్తనలో శ్రీదేవీ పురుషోత్తములను యౌవనప్రాయమొచ్చిన బావామరదళ్ళుగా ఊహించుకున్నారు. మనసులు కలసిన ప్రేమికులు దొంగచాటుగా కలుసుకోవడం, కబుర్లుచెప్పుకోవడం వలపుధర్మంకదా? పెద్దలు పెట్టిన ముహూర్తంవరకు ఆగమంటే కుదురులేని మనసులు వింటాయా? ఒకరికై ఒకరు తపిస్తుంటారు. అయ్యవారేమో పదే పదే కలవాలని సైగలతో సందేశం ఇస్తుంటారు. ఆయనకు కుదిరినంత సులువుగా ఆమెకు కుదరద్దూ? ఎందరి కన్నులు కప్పి రావాలో. ఇన్నీ దాటుకుని ఆమె వచ్చినా అయ్యవారేమో "నీకు నామీద ప్రేమేలేదు; నన్ను చూడాలనే నీకు తోచదు" అని నిందిస్తున్నారు. నా పొందుకు నువ్వెంత పరితపిస్తున్నావో, నీ పొందుకు నేనూ అంతే పరితపిస్తున్నాననీ, కలుసుకోడంలో తనకున్న కష్టాలు ఇవీయని చెప్తున్నారు అమ్మవారు.
============================================
రాగం : మధ్యమావతి
శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో
AUDIO 1
ఇక్కడ వినండి
AUDIO 2
(గాయకుల పేర్లు తెలిస్తే చెప్పండి)
============================================
రాగం : మధ్యమావతి
శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో
AUDIO 1
ఇక్కడ వినండి
AUDIO 2
(గాయకుల పేర్లు తెలిస్తే చెప్పండి)
============================================
పల్లవిఇద్దరి తమకము నిటువలెనేపొద్దున నేమని బొంకుదమయ్యా
చరణం 1
లలి నాకధరము లంచమియ్యగాపలు సోకులయి పరగెనవేపిలువగరాగా బెరసి నిందవడేపొలతికి నేమని బొంకుదమయ్యా
చరణం 2
అడుగుకొనుచు నిన్నంటి పెనగగాతడయక నఖములు తాకె నవేతొడుకొనిరాగా దూఱు మీదబడెపొడవుగ నేమని బొంకుదమయ్యా
చరణం 3
పెక్కులు చెవిలో బ్రియములు చెప్పగ
ముక్కున జవ్వాది మోచె నిదేయిక్కడ శ్రీవెంకటేశుడ సడివడెపుక్కటి నేమని బొంకుదమయ్యా
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):తమకము = తొందర, విరహముఇటువలనే = ఇటువంటిదే (ఒకలాంటిదే)పొద్దున = ఉదయం, తెల్లవాఱుబొంకు = అబద్ధములలి = ప్రేమ, వికాసము, ఉత్సాహము, సొగసులంచము = ఉత్కోచము, bribeపలు = ఎక్కువ, అనేకముసోకు = స్పర్శపరగెనవే =పరసరించినవి, వ్యాపించినవి, పెరిగినవిబెరసి = క్రూరంగానిందవడే = అపవాదమొచ్చెనుపొలతి = మగువ
అడుగుకొను = ప్రాధేయపడుతడయక = అడ్డులేకతొడుకొనిరాగా = పట్టుకునిరాగాదూఱు = నిందపొదువుగ = కప్పిపుచ్చేలాపెక్కులు = పలుమార్లు, చాలాసార్లు (పెక్కులంటే మాటలని కూడా అర్థముంది)ప్రియములు = ప్రేమపూరితమైన మాటలుజవ్వాది = పునుగు, సంకుమదముమోచెనిదె = అంటినదిసడి = అపకీర్తి, నింద, అపవాదముపుక్కటి = ఊరకే, అప్రయత్నంగ
తాత్పర్యం :
నన్ను
కలసుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో, నేనూ అంతే తపనపడుతున్నాను. మనం
కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎవరి కంటైనా పడితే వాళ్ళడగరూ ఏం చేస్తున్నారని? ఆ
సమయానికి వారికి చెప్పేందుకు ఏం సాకులుంటాయి? నువ్వు రమ్మన్నా నేను
రాలేదంటే ప్రేమలేకకాదు; ఏ వంకతో కలవాలో తెలియక.
ఎలాగో
కలుసుకున్నా, నాకేమో వెళ్ళాలనీ, నీకేమో ఉండాలనీ ఉంటుంది. నువ్వు
ఊరుకుంటావా? నన్ను ఇక్కడే కట్టిపడేసేలా, ప్రేమగా అధరాలతో ముద్దుల
లంచములిచ్చిపుచ్చుకుంటాము. అప్పుడు తనువులు తాకి, పరవశములు పెరిగిపోతాయి.
స్పర్శలూ పెరుగుతాయి. ఇంతలో నేనుకనబడలేదని మావాళ్ళు నన్ను వెతుక్కుంటారు.
వెతికే చెలికత్తెలు నన్నుగనుక ఇక్కడ చూస్తే ఇక అంతే! అనవసరమైన
నిందలొస్తాయి. ఇక్కడెందుకున్నావని అడిగితే నేనేంవంక చెప్పను?
వెళ్ళాలి
వదులు అని నేను బ్రతిమాలుతుంటే నువ్వోమో ఇంకా నన్ను గట్టిగా లాక్కునే
ప్రయత్నం చేస్తావు. ఆ కంగారులో నీ గోళ్ళు నా మేన గాయాలుచేస్తాయి. ఆ
గాయాలెంటి అని అడగరూ? నిన్ను తీసుకోస్తునట్టు, నీచేయిబట్టుకొని
వద్దామనుకుంటాను. ఏంటి ఇలా చేయిబట్టి తీసుకొస్తున్నావే? అని చెలికత్తెలు
దూషించనూవచ్చు. దూషించేవారికి ఏం కట్టుకథలు చేప్పగలము?
మనం
కలిసి చిలిపి రహస్యాలు చెవిలో ముచ్చటించినప్పుడు నీ బుగ్గలమీదున్న జవ్వాది
నా ముక్కుకంటుకుంటుంది. అది చూసి నా చెలికత్తెలందరూ గుసుగుసగా నవ్వుకుని,
అనుమానంగా అడుగుతారు. ముందుగా ఏమీ ఆలోచించుకోకుండా అప్పటికప్పుడే నేను
తికమకపడుతూ ఏం కథలు చెప్పినా వారు నన్ను నమ్మరు, స్వామీ! మనిద్దరికీ
అపవాదమొస్తుంది.
================================
rAgaM : madhyamAvati
pallavi
iddari tamakamu niTuvalenae
podduna naemani boMkudamayyaa
charaNaM 1
lali naakadharamu laMchamiyyagaa
palu sOkulayi paragenavae
piluvagaraagaa berasi niMdavaDae
polatiki naemani boMkudamayyaa
charaNaM 2
aDugukonuchu ninnaMTi penagagaa
taDayaka nakhamulu taake navae
toDukoniraagaa doo~ru meedabaDe
poDavuga naemani boMkudamayyaa
charaNaM 3
pekkulu chevilO briyamulu cheppaga
mukkuna javvaadi mOche nidae
yikkaDa SreeveMkaTaeSuDa saDivaDe
pukkaTi naemani boMkudamayyaa
================================
భాస్కర్ గారు:
ReplyDeleteమీ కృషికి అభినందనలు. ఇవి ఈ తరానికి ఎంతో వుపయోగపడతాయి. అలాగే, ఇతర వాగ్గేయకారుల గురించి కూడా అప్పుడప్పుడూ రాయండి.
అఫ్సర్
మంచి ప్రయత్నం భాస్కర్ గారు! కొనసాగించండి.
ReplyDeleteభాస్కర్, అసలు ఎన్నిసార్లు విని వుంటావో కదా, ఇంత చక్కని సరళమైన రీతిలో ఈ కీర్తనని వర్ణించడానికి!!! చాలా రసరమ్యంగా ఉంది.... నీ ప్రయత్నానికి జోహార్లు! :-)
ReplyDeleteఅఫ్సర్ గారు,
ReplyDeleteనా కృషిని మెచ్చినందుకు ధన్యవాదములండి. అన్నమయ్య కీర్తనలను ఎక్కువమందికి చేరుసువ చెయ్యాలన్నదే నా ఈ ప్రయత్నం. మిగిలిన వాగ్గేయకారుల కృతులకు రాయడం విషయం ఆలోచిస్తాను. ధన్యవాదములు.
సుబ్రహ్మణ్యం గారు,
తప్పకుండ చేస్తానండి. ధన్యవాదములు.
నిషి,
ఎన్నిసార్లు విని ఉంటావో అంటే, అవును చాలా సార్లే విన్నాను, చదివాను. అన్ని సార్లు వినాలనిపించే రీతిలో రసరమ్యంగా ఉంటాయి అన్నమయ్య కీర్తనలు.
భాస్కర్ గారు,
ReplyDeleteచాలా బావుంది మీ వ్యాఖ్య. ఎంతో వివరంగా ప్రతిపద అర్థాన్ని ఎంచక్కా వివరించారు.
ఆ లంచం అనే పదానికి వివరణ మాత్రం కొంచెం నవ్వొచ్చింది...పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్టు అంటారే..అది గుర్తొచ్చి. ఉత్కోచము అంటే లంచము అన్నమాట నాకు తెలియదు ఇప్పటిదాక. బావుంది.
Sweet! :)
ReplyDeleteBeautiful.
ReplyDeleteశ్రీరంగం గోపాలరత్నం గారి రికార్డు మా యింట్లో ఉండేది నా చిన్నప్పుడు. అప్పుడూ తెలుసుకునే వయసూ కాదు, తెలిసి ఆనందించే అనుభవమూ లేదు. మరోసారి మధురానుభూతి కలిగించారు. నెనర్లు.
ఇవాళ నరేశ్ నున్నా గారి రాతతో ఓ పదానికి అర్థం వెతుక్కుంటూ వస్తే మీ వాఖ్యానం తగిలింది.
ReplyDeleteబహు రమ్యం.