స్వామి వియోగంలో వున్న అమ్మావారి స్థితిని ఈ కీర్తనద్వారా చెలికత్తె మాటల్లో తెలియజేస్తున్నాడు అన్నమయ్య.
===============================================
రాగం : సామంతం
గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ (GBK) గారి గళంలో
ఇక్కడ వినండి (right click and open in a new window/tab)
===============================================
పల్లవిఎటువంటి మోహమో యెట్టి తమకమో కాని
తటుకునను దేహ మంతయు మఱచె చెలియ
చరణం 1పలుకుదేనెల కొసరి పసిడికిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను బాడి పాడి
కలికి కన్నీరు బంగారుపయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియచరణం 2పడతి నీవును దాను పవళించుపరపుపై
పొడము పరితాపమున బొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారుచెమటల దోగి
యుడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ
చరణం 3తావిచల్లేడి మోముదమ్మి గడు వికసించె
లోవెలితి నవ్వులను లోగి లోగి
శ్రీవేంకటేశ లక్ష్మీకాంత నిను గలసి
ఈ వైభవము లందె నిదివో చెలియ
కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు / Meaning (సందర్భోచితమైన అర్థాలు):
తటుకున = తటుక్కున
పలుకుదేనెల = తేనెలవంటి మాటలు
కొసరి = అర్ధించి
పసిడికిన్నెర = బంగారువీణ
పలుచనెలుగున = పలుచని+ఎలుగున = సన్నటి గొంతుతో, గళముతో
పలుచనెలుగున = పలుచని+ఎలుగున = సన్నటి గొంతుతో, గళముతో
బాడిపాడి = పాడిపాడి = పలుమార్లు ఆలపించి
పొదము = కలిగే
బొరలి పొరలి = పొరలిపొరలి
జడిగొన్న = వ్యాపించియున్న
దోగి = తడిసి / కరిగి
నుసురుసురాయె = అల్లాడిపోవు / తపించు
తావిచల్లేడి = సువాసనలు వెదజల్లే
మోముదమ్మి = తామెరవంటి ముఖము
గడు వికసించె = అద్భుతముగ వికసించెను
లోవెలితి = లోపల వెలితిగాయున్న
==========================================
rAgaM : sAmanthaM
pallavi
eTuvaMTi mOhamO yeTTi tamakamO kAni
taTukunanu dEha maMtayu ma~rache cheliya
charaNaM 1
palukudEnela kosari pasiDikinnera meeTi
paluchaneluguna ninnu bADi pADi
kaliki kanneeru baMgArupayyeda noluka
talayUchi tanalOne talavaMchu cheliya
charaNaM 2
paDati neevunu dAnu pavaLiMchuparapupai
poDamu paritApamuna borali porali
jaDigonna javvAdi jAruchemaTala dOgi
yuDuku nUrupula nusurusurAye cheliya
charaNaM 3
tAvichallEDimOmu dammi gaDu vikasiMche
lOveliti navvulanu lOgi lOgi
SreevEMkaTESa lakshmee kAMta ninu galasi
ee vaibhavamu laMde nidivO cheliya
==========================================
rAgaM : sAmanthaM
pallavi
eTuvaMTi mOhamO yeTTi tamakamO kAni
taTukunanu dEha maMtayu ma~rache cheliya
charaNaM 1
palukudEnela kosari pasiDikinnera meeTi
paluchaneluguna ninnu bADi pADi
kaliki kanneeru baMgArupayyeda noluka
talayUchi tanalOne talavaMchu cheliya
charaNaM 2
paDati neevunu dAnu pavaLiMchuparapupai
poDamu paritApamuna borali porali
jaDigonna javvAdi jAruchemaTala dOgi
yuDuku nUrupula nusurusurAye cheliya
charaNaM 3
tAvichallEDimOmu dammi gaDu vikasiMche
lOveliti navvulanu lOgi lOgi
SreevEMkaTESa lakshmee kAMta ninu galasi
ee vaibhavamu laMde nidivO cheliya
==========================================